TG: రాష్ట్ర పర్యావరణ చరిత్రలో ఒక అరుదైన రికార్డు నమోదైంది. భారతదేశంలోనే అత్యంత భారీ సీతాకోకచిలుక జాతులలో ఒకటిగా గుర్తింపు పొందిన ‘సదరన్ బర్డ్‌వింగ్’ మొదటిసారిగా తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో ప్రత్యక్షమైంది. సాధారణంగా పశ్చిమ కనుమలలో కనిపించే ఈ సీతాకోకచిలుక, తూర్పు కనుమల పరిధిలోకి వచ్చే అమ్రాబాద్ అడవుల్లో కనిపించడం పర్యావరణ శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నీలేష్, వన్యప్రాణి జీవశాస్త్రవేత్త డాక్టర్ రవికాంత్ ఈ అరుదైన సీతాకోకచిలుకను కనుగొని రికార్డు చేశారు.