జెనోవా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అంటార్కిటికా మంచుఖండం కింద దాదాపు 30 బేసిన్‌లతో కూడిన ఒక భూభాగాన్ని గుర్తించారు. దీనికి 'ఈస్ట్ అంటార్కిటికా ఫ్యాన్ ఆకార బేసిన్ ప్రావిన్స్' అని నామకరణం చేశారు. గోండ్వానాలాండ్ విడిపోవడానికి ముందే ఈ భూభాగం ఏర్పడి ఉండవచ్చని, ఇది అంటార్కిటికా, ఆస్ట్రేలియా వేరుపడటానికి కారణమై ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. రాడార్ చిత్రాలు, ఇతర డేటా విశ్లేషణ ద్వారా ఈ ఆవిష్కరణ జరిగింది. మంచు కరిగితే ఈ భూభాగం ఒక కిలోమీటరు మేర పైకి లేస్తుందని అంచనా.