తెలుగు రాష్ట్రాల ఆదాయ పన్ను ప్రిన్సిపల్ చీఫ్‌ కమిషనర్‌గా సురేశ్‌ బత్తిని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆదాయపన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా సీనియర్ ఐఆర్ఎస్ అధికారి సురేశ్ బత్తిని నియమితులయ్యారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ బాధ్యతల్లో ఉన్న మోరంపూడి అనిల్ కుమార్ స్థానంలో సురేశ్ బత్తిని బాధ్యతలు స్వీకరించనున్నారు. తెలుగు అధికారికి మరోసారి ఈ అత్యున్నత పదవి దక్కడం విశేషం.

సంబంధిత పోస్ట్