సూర్యాపేటలో ఇండస్ట్రియల్ పార్కులు, ఐటి హబ్ రంగాన్ని తిరిగి పునరుద్ధరించాలని తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం సూర్యాపేటలో జిల్లా కేంద్రంలో తన కార్యాలయంలో విలేకరులతో వారు మాట్లాడుతూ.. ధరణి వెబ్సైట్ లో పాత ఆన్‌లైన్ యాప్ తీసేయడం వల్ల ప్రజలకు సర్టిఫై కాపీలు రావట్లేదన్నారు. ధరణి ఆన్లైన్ సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలన్నారు.