కేంద్ర ప్రభుత్వం వివిధ కేటగిరీల్లో ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ అవార్డులు ప్రకటించింది. జాతీయస్థాయిలో స్పెషల్ కేటగిరీ మినిస్టీరియల్ అవార్డు విశాఖపట్నం దక్కించుకుంది. రాష్ట్రస్థాయిలో రాజమహేంద్రవరానికి దక్కింది. స్వచ్ఛ సూపర్‌లీగ్ సిటీస్ విభాగంలో విజయవాడ, తిరుపతి, గుంటూరు ఎంపికయ్యాయి. సీఎం చంద్రబాబు చేపట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల వల్లే ఈ అవార్డులు లభించాయని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ పేర్కొన్నారు.