జాతీయ స్థాయిలో తెలంగాణ పంచాయతీలు

గ్రామీణాభివృద్ధి, సుస్థిర పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన “దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు” (DDUPSVP) లో రాష్ట్రానికి చెందిన రెండు గ్రామ పంచాయతీలు జాతీయ అవార్డులను దక్కించుకున్నాయి. గుడ్ ఫర్ గవర్నెన్స్ విభాగంలో వికారాబాద్ జిల్లా మోతుకుపల్లి గ్రామ పంచాయతీ, విమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ విభాగంలో సంగారెడ్డి జిల్లా ఫసల్వాడి గ్రామ పంచాయతీ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలకు ఎంపికయ్యాయి. గ్రామ స్థాయిలో పారదర్శక పరిపాలన, ప్రజల భాగస్వామ్యం, మహిళా సాధికారత, సంక్షేమ కార్యక్రమాల అమలులో చూపిన ప్రతిభకు ఈ అవార్డులు దక్కాయి.

సంబంధిత పోస్ట్