ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పర్వత ప్రాంతంలో వర్షాకాలంలో లభించే కీడాజడీ అనే పురుగులు లక్షల్లో ధర పలుకుతున్నాయి. దాదాపు ఈ పురుగుల ధర దాదాపు కిలో రూ.25 లక్షలు పలుకుతోంది. దీంతో తపోవన్, చమోలీ తదితర గ్రామాల ప్రజలు వీటి కోసం రోజంతా కష్టపడి హిమాలయ పర్వతాలు మొత్తం గాలిస్తుంటారు. ఫంగస్ రకానికి చెందిన ఈ పురుగులు గొంగళి పురుగు లార్వాని ఆక్రమించుకుని, మనుగడ సాగిస్తాయి. దీనిని చైనా సంప్రదాయ వైద్యంలో ఎక్కువగా వాడతుంటారు.