ఈ రైల్వే స్టేషన్ల పేరు రెండు అక్షరాలే... ఏమని పిలుస్తారో తెలుసా?

రతీయ రైల్వే నెట్‌వర్క్‌లో ఒడిశాలోని ఇబ్, గుజరాత్‌లోని ఓడ్ అనే రెండు అక్షరాల పేర్లతో ఉన్న స్టేషన్లు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఒడిశాలోని ఇబ్ స్టేషన్, సమీపంలోని ఇబ్ నది పేరుతో 1891లో ప్రారంభమైంది. ఈ ప్రాంతం బొగ్గు గనులకు ప్రసిద్ధి. గుజరాత్‌లోని ఓడ్ స్టేషన్ ఆనంద్-గోద్రా సెక్షన్‌లో ఉంది. ఈ రెండు స్టేషన్ల పేర్లు భారతీయ రైల్వేలోని అతి చిన్న పేర్లుగా గుర్తింపు పొందాయి. దేశంలో అతి పొడవైన స్టేషన్ పేరు 'పురట్చి తలైవర్ డాక్టర్ ఎం.జీ. రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్' (57 అక్షరాలు) తో పోలిస్తే ఇవి చాలా చిన్నవి.

సంబంధిత పోస్ట్