అరుణాచల్ ప్రదేశ్‌లోని అంజావ్ జిల్లాలో ఉన్న డోంగ్ గ్రామం, భారతదేశంలో సూర్యుడిని మొట్టమొదటగా చూసే నివాస ప్రాంతంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. సముద్ర మట్టానికి 1,240 మీటర్ల ఎత్తులో, భారతదేశం, చైనా, మయన్మార్ సరిహద్దులకు సమీపంలో ఉన్న ఈ గ్రామంలో సూర్యోదయం దేశంలోని ఇతర ప్రాంతాల కంటే గంట ముందుగా కనిపిస్తుంది. సాహసయాత్రలు, ప్రకృతిని కోరుకునే పర్యాటకులకు ఇది అద్భుతమైన అనుభూతినిస్తుంది. వాలాంగ్ నుండి కష్టతరమైన ప్రయాణం ద్వారా లోహిత్ నదిని దాటి డోంగ్‌ను చేరుకోవచ్చు.