సాధారణ బాంబులు రసాయన చర్యల ద్వారా పేలుతాయి, కానీ న్యూక్లియర్ బాంబులు అణువుల కేంద్రకంలోని శక్తిని విడుదల చేస్తాయి. ఇవి అణు విచ్ఛిత్తి (ఫిషన్), అణు సంలీనం (ఫ్యూజన్) అనే రెండు పద్ధతుల్లో పనిచేస్తాయి. ఫిషన్ ద్వారా భారీ అణువులను విడగొట్టి చైన్ రియాక్షన్ ద్వారా పేలుడు సంభవిస్తుంది, ఇది హిరోషిమా, నాగసాకిలలో జరిగింది. ఫ్యూజన్లో చిన్న అణువులను కలిపి పెద్ద అణువుగా మారుస్తారు, ఇది ఫిషన్ బాంబుల కంటే వందల రెట్లు శక్తివంతమైనది. ఈ బాంబులు వేడి, పీడన తరంగాలు, రేడియోధార్మికతతో ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. 1945లో అమెరికా జపాన్‌పై వీటిని మొదటిసారి ప్రయోగించింది.