స్కాట్లాండ్లోని వెస్ట్ రే - పాపా వెస్ట్ రే ద్వీపాల మధ్య ప్రపంచంలోనే అతి తక్కువ దూరపు విమాన సర్వీస్ నడుస్తోంది. కేవలం 2.7 కిలోమీటర్ల దూరమున్న ఈ ప్రయాణం అనుకూల వాతావరణంలో సుమారు 53 సెకన్లలో పూర్తవుతుంది. 1967 నుంచి వంతెన నిర్మాణం సాధ్యం కాని పరిస్థితుల్లో అత్యవసర వైద్యం, స్థానిక రవాణా అవసరాల కోసం ఈ విమానాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ సర్వీస్ ద్వీపాల ప్రజలకు కీలక రవాణా మార్గంగా నిలుస్తోంది.