రైతులు మార్కెట్లలో, ఐకేపీ సెంటర్లలో ధాన్యం ఆరబెట్టుకుంటూ అష్ట కష్టాలు పడుతుంటే వర్ధన్నపేట ఎమ్మెల్యే వారి బాధలు పట్టించుకోకుండా పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ తిరుగుతున్నారని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మహేందర్ రెడ్డి బుధవారం విమర్శించారు. ధాన్యం కొనుగోలు సెంటర్ల ప్రారంభోత్సవం అంటూ ఫొటోలకు ఫోజులిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. రైతుల బాధలు చూడకపోవడం చాలా బాధాకరమన్నారు.