టిష్యూ పేపర్లు ఎందుకు తెలుపు రంగులోనే ఉంటాయో తెలుసా?

టిష్యూ పేపర్లు సాధారణంగా తెలుపు రంగులోనే ఉండటానికి కారణాలున్నాయని నిపుణులు వెల్లడించారు. చెట్ల నుంచి లభించే సెల్యులోజ్ ఫైబర్‌లు సహజంగా తెల్లగా ఉంటాయి. తయారీ సమయంలో గోధుమ రంగు జిగురును తొలగించి, కాగితాన్ని తెల్లగా మెరిసేలా చేయడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ లేదా క్లోరిన్‌తో బ్లీచ్ చేస్తారు. రీసైకిల్ చేసిన కాగితంతో తయారు చేసే టిష్యూలలో.. తెల్లటి కాగితాన్ని కూడా ఉపయోగిస్తారు. రంగు రంగుల కాగితాలను టిష్యూ పేపర్‌గా ఉపయోగించకపోవడానికి బడ్జెట్, పర్యావరణ అనుకూలత, చర్మ సమస్యలు వంటి కారణాలున్నాయని సమాచారం.

సంబంధిత పోస్ట్