AP: సర్వే రాళ్లపై మాజీ సీఎం జగన్ పేరు తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ప్రత్యేకంగా కటింగ్ మిషన్ల ద్వారా పేర్లను చెరిపేయనున్నారు. ఒక్కో రాయిపై పేరు తొలగింపునకు కనీసం రూ.15 వరకు ఖర్చు కానున్నట్లు సమాచారం. అయితే కొన్ని జిల్లాల్లో పేర్ల తొలగింపునకు ఎక్కువ మొత్తం డబ్బులు అడుగుతున్నట్లు తెలుస్తోంది. చెల్లింపు విషయంలో క్లారిటీ వస్తే.. పనులు త్వరగా ప్రారంభమవుతాయి.