AP: మంత్రి నాదెండ్ల మనోహర్ రోడ్డు పక్కన ఉన్న బడ్డీ కొట్టులో టీ తాగారు. రైస్ మిల్లుల తనిఖీల నేపథ్యంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లికి మంత్రి నాదెండ్ల వెళ్లారు. ఆ సమయంలో రోడ్డు పక్కనే కారు ఆపించి టీ తాగి నిత్యావసర ధరలపై సామాన్యులను అడిగి తెలుసుకున్నారు.ఒక సాధారణ పౌరుడిలా రోడ్డు పక్కన టీ తాగడంతో నాదెండ్లపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.