అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి రూ. 16 కోట్ల ఇంజెక్షన్

51చూసినవారు
అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి రూ. 16 కోట్ల ఇంజెక్షన్
అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు. పశ్చిమ బెంగాల్‌‌కు చెందిన దిన్ మహ్మద్ అనే చిన్నారి స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే ఈ వ్యాధి నయం కావాలంటే రూ. 16 కోట్ల జొల్జెన్‌స్మా ఇంజక్షన్ వేయాలని వైద్యులు సూచించారు. అంతా డబ్బు చిన్నారి కుటుంబ సభ్యుల వద్ద  లేకపోవడంతో.. దాతలు, ప్రభుత్వ సాయంతో తాజాగా బాలుడికి ఆ ఇంజక్షన్‌ ఇచ్చారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు కోల్‌కతా వైద్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్