ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాకు సైనికపరంగా అండగా ఉన్న 275 సంస్థలు, వ్యక్తులపై అమెరికా ఆంక్షలు విధించింది. ఇందుకు సంబంధించిన జాబితాను గురువారం విడుదల చేసింది. వీటిలో భారత్కు చెందిన 15 సంస్థలపై ఆంక్షలు విధించింది. ఈ జాబితాలో ఇండియాకు చెందిన అబార్ టెక్నాలజీస్, డెన్వాస్ సర్వీసెస్, ఎమ్సిస్టెక్, గ్యాలక్సీ బేరింగ్స్, ఇన్నోవియో వెంచర్స్, ఖుష్భూ హానింగ్, లోకేశ్ మెషిన్స్ తదితర సంస్థలు ఉన్నాయి.