గోరుచిక్కుడు తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. గోరుచిక్కుడు తింటే తక్కువ కేలరీలతో పాటు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, నీరు, ఫైబర్, కాల్షియం, ఐరన్, విటమిన్ సి లభిస్తుంది. గోరుచిక్కుడుతో ఆస్తమా సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గుతుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉండే ఫైటోకెమికల్స్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.