పులివర్తి నానిపై దాడి కేసులో నిందితులకు రిమాండ్

68చూసినవారు
పులివర్తి నానిపై దాడి కేసులో నిందితులకు రిమాండ్
AP: చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి ఘటనకు సంబంధించి 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిని తిరుపతి ఏడీజే కోర్టులో హాజరుపర్చగా.. వారందరికీ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. నిందితులను పోలీసులు చిత్తూరు సబ్ జైలుకు తరలించారు. కాగా, ఈ నెల 14న తిరుప‌తిలోని పద్మావతి యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లిన నానిపై దాడి జరిగిన సంగ‌తి తెలిసిందే.

ట్యాగ్స్ :