మోడీకి అభినందనలు తెలిపిన మస్క్

76చూసినవారు
మోడీకి అభినందనలు తెలిపిన మస్క్
ఎన్నికల్లో విజయంపై ప్రధాని మోడీకి టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ శుక్రవారం అభినందనలు తెలిపారు. భారతదేశంలో తమ కంపెనీలు భవిష్యత్తులో మరింత ఉత్తేజంగా పని చేస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. మోడీ వరుసగా మూడోసారి ప్రధానిగా జూన్ 9న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరో వైపు భారత్‌లో టెస్లా ప్లాంట్ త్వరలో ప్రారంభం కానుంది. అంతేకాకుండా స్టార్ లింక్ ద్వారా ఇంటర్‌నెట్ సేవలు కూడా ప్రారంభించేందుకు మస్క్ యోచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్