AP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బియ్యం, కందిపప్పు, పంచదారతో పాటు చిరుధాన్యాలను కూడా సరఫరా చేస్తామని తెలిపింది. అయితే కొన్ని నెలలు కందిపప్పుతో పాటు జొన్నలు కూడా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అయితే టెండర్లు పూర్తికాకపోవడంతో కందిపప్పు, రాగుల సరఫరా కష్టమేనని అధికారులు చెబుతున్నారు. ఈ నెల కూడా బియ్యం, పంచదార మాత్రమే ప్రభుత్వం పంపిణీ చేయనుంది.