ఎలియాస్ హోవే అనే అమెరికన్ పత్తి కర్మాగారంలో మెషినిస్ట్‌గా పని చేసేవారు. హోవే జీతం తక్కువ కావడంతో అతడి భార్య ఇంట్లో ఇతరులకు చేతితో బట్టలు కుట్టేవారు. ఆమె కష్టాన్ని గుర్తించిన హూవే ఆరు నెలలు కష్టించి 1845 ఫిబ్రవరి 28న కుట్టుమిషన్‌ను కనిపెట్టాడు. ప్రపంచ చరిత్రలో అత్యంత ఉపయోగకరమైన యంత్రంగా, ప్రపంచం మొత్తం గర్వపడేలా దీనిని రూపొందించారు. ఈ కుట్టుమిషన్‌ను ఆవిష్కరించిన రోజునే ప్రపంచ టైలర్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు.