ఒక జత కుట్టేందుకు అయ్యే కూలికే రెడీమేడ్ దుస్తులు లభిస్తుండటంతో చాలా మంది వాటినే కొనుగోలు చేస్తున్నారు. దీంతో దర్జీలకు ఉపాధి తగ్గిపోవడంతో వృత్తిని వదులుకొని బతుకుతెరువు కోసం ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. చాలా మంది భవన నిర్మాణ కార్మికులుగా, కాపలాదారు. రోజువారి కూలీలుగా పని చేయడానికి వెళ్తున్నారు. కొందరు కులవృత్తిని వదులుకోలేక స్థానికంగానే ఉంటున్నారు.