గతంలో రెండు మూడు సామాజిక వర్గాలు మాత్రమే దర్జీ వృత్తిని చేపట్టేవారు. పండుగలు, శుభకార్యాల సమయంలో వారికి చేతి నిండా పని ఉండేది. భోజనం చేసే తీరిక ఉండేది కాదు. కాలక్రమంలో ఇతరులు ఈ వృత్తిని స్వీకరించడంతో పని తగ్గింది. రెడీమేడ్ దుస్తుల రంగప్రవేశంతో పరిస్థితి దయనీయంగా మారింది. కొత్త కొత్త ప్యాషన్లకు అనుగుణంగా కుట్టే నేర్పు ఉన్నా, రెడీమేడ్ దుస్తుల వల్ల ఆదరణ తగ్గుతూ వస్తోంది.