భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపు
AP: కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెంచుతూ నిర్ణయించింది. భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపుదలకు సంబంధించిన పూర్తి నివేదికను జనవరి 15వ తేదీ నాటికి ఇవ్వాలని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. సగటున 15 నుంచి 20 శాతం వరకు రిజిస్ట్రేషన్ విలువ పెంపుదల ఉంటుందని మంత్రి చెప్పారు.