ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరగనున్న మహా కుంభమేళాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనున్న ఈ వేడుకకు ప్రపంచ నలుమూలల నుంచి 40 కోట్ల మంది వస్తారని అంచనా. 1,60,000 టెంట్లు, 1,50,000 టాయిలెట్ల నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. పారా మిలిటరీ బలగాలతోపాటు 50 వేల మంది సిబ్బందిని నియమించారు. AIతో కూడిన 2700 కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నారు.