AP: సీఎం చంద్రబాబు నేడు (మంగళవారం) పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. నరసరావుపేట నియోజకవర్గం యలమందల గ్రామంలో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. వి.ఏడుకొండలు, తలారి శారమ్మ ఇళ్లకు వెళ్లి పింఛన్ అందజేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పింఛన్ పంపిణీ తర్వాత సీఎం చంద్రబాబు గ్రామస్థులతో ముచ్చటిస్తారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత కోటప్పకొండకు వెళ్లి త్రికోటేశ్వరస్వామిని దర్శించుకుంటారు.