మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో కీలక పరిణామం

67చూసినవారు
AP: అన్నమయ్య జిల్లా మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్ గౌతమ్‌ తేజ్‌ను సోమవారం పలమనేరు కమాండ్‌ కంట్రోల్‌ వద్ద అరెస్టు చేసినట్లు సీఐడీ డీఎస్పీ వేణుగోపాల్‌ ప్రకటించారు. నిందితుడికి సహకరించిన, కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ విచారించి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వెల్లడించారు. నిందితుడిని చిత్తూరు మున్సిఫ్‌ కోర్టులో హాజరుపరచగా.. 14 రోజులు రిమాండ్ విధించారు.

సంబంధిత పోస్ట్