విశాఖ: క్యూబాపై అమెరికా పెట్టిన ఆంక్షలు దుర్మార్గం
సోషలిస్టు దేశం క్యూబాపై అమెరికా పెట్టిన ఆంక్షలు దుర్మార్గమని, తక్షణం ఆంక్షలు ఎత్తివేయాలని సిపిఎం సీనియర్ నాయకులు వై. రాజు డిమాండ్ చేశారు. క్యూబాపై అమెరికా ఆంక్షలకు నిరసనగా మంగళవారం పూర్ణా మార్కెట్ స్ప్రింగ్ రోడ్లో పార్టీ జగదాంబ జోన్ నాయకులు ఎం. సుబ్బారావు ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు. క్యూబాలో ప్రత్యేక పరిస్థితుల కారణంగా మందులు, ఆహార పదార్థాలు విదేశాల నుంచి కొనుక్కునే పరిస్థితి ఉందన్నారు.