
విశాఖ :గూడ్సు రైలు పైపు లీక్‌తో రైల్వే గేటు వద్ద ట్రాఫిక్ జాం
ఉక్కునగరం స్టీల్ సెక్టారు-3లో గూడ్సు రైలు ఎయిర్ పైపు లీక్ కావడంతో మంగళవారం జీవీఎంసీ 88వ వార్డు పకీరుతక్యా-కాపు జగ్గరాజుపేట రహదారి మధ్య రైల్వే గేటు వద్ద ట్రాఫిక్ నిలిచిపోయింది. అరగంట పాటు వాహనాలు, పాదచారులు ఆగిపోయారు. కళాశాల విద్యార్థులు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. సిబ్బంది పైపును మరమ్మతు చేసి రైలును దువ్వాడ రైల్వే స్టేషన్ వైపుకు తీసుకెళ్లారు.