BRS కీలక నిర్ణయం.. నిరసనలకు పిలుపు
BRS పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో వానాకాలం రైతు భరోసా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ రేపు (ఆదివారం) అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టాలని కార్యకర్తలకు సూచించారు. కాగా, క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత రాబోయే సీజన్ నుంచి రైతు భరోసా పథకం అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.