
వాహనదారులకు అలర్ట్.. ఫిబ్రవరి 17 నుంచి ఈ రూల్స్ మార్పు
ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారులకు అలర్ట్. ఫిబ్రవరి 17 నుంచి కొత్త ఫాస్ట్ ట్యాగ్ రూల్స్ అమలు కాబోతున్నాయి. దేశంలో ఇప్పటికే అనేక మంది వారి వాహనాలపై ఫాస్ట్ ట్యాగ్లను ఏర్పాటు చేసుకున్నారు. ఫిబ్రవరి 17, 2025 నుంచి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త ఫాస్ట్ ట్యాగ్ రూల్స్ అమలు చేయనుంది. ఈ నియమాల ప్రకారం మీరు కొత్త చెల్లింపు విధానాలను పాటించకపోతే, అదనంగా మీరు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.