వాట్సాప్ మాతృ సంస్థ మెటా మరో ప్రకటన చేసింది. వాట్సాప్‌లో త్వరలోనే మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తాజాగా వెల్లడించింది. వినియోగదారులు తమ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లను నేరుగా తమ వాట్సాప్ ఖాతాలకు లింక్ చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం iOS కోసం బీటాలో ఉన్నట్లు తెలిపింది.