ప్రజలను ఆకట్టుకున్న కాంతార, కేరళ డ్రమ్స్, గొరవయ్యల నృత్యాలు

563చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రజావేదిక వద్ద గురువారం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు నామినేషన్ సందర్భంగా కేరళ డ్రమ్స్, గొరవయ్యల నృత్యాలు, కాంతార దేవుని ప్రదర్శన, ఉరాలు, తప్పెట్ల శబ్దాలకు మహిళలు సైతం నృత్యాలు చేశారు. సురేంద్రబాబు ర్యాలీగా నామినేషన్ వేయడానికి వెళుతున్న సమయంలో కేరళ డ్రమ్స్, తప్పెట్ల మోతలకు యువకులు, మహిళలు నృత్యాలు చేయడం ప్రజలకు కనువిందు కల్పించింది.