ఆర్యవైశ్య యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా అనంతపురం నగరానికి చెందిన శబరీ వరప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం ఆ సంఘం నాయకులు, జిల్లా ఇన్ చార్జ్ మంత్రి టిజి భరత్తో కలిసి అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా శబరీ వరప్రసాద్ మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు. తనకు సహకారాన్ని అందించిన మంత్రి టిజి భరత్ కు, ఆర్యవైశ్య సంఘం నాయకులకు రుణపడి ఉంటానని అన్నారు.