Oct 28, 2024, 05:10 IST/నిజామాబాద్ అర్బన్
నిజామాబాద్ అర్బన్
నిజామాబాద్: పండ్ల దూకణ సముదాయంలో తోపుడు బండ్లు దగ్ధం
Oct 28, 2024, 05:10 IST
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీనగర్ శంకర్ భవన్ పాఠశాల ముందు ఉన్న పండ్ల షెడ్డు, తోపుడు బండ్లు ఆదివారం రాత్రి దగ్ధమయ్యాయి. మంటలు ఎగిసిపడి షెడ్డుతో పాటు, బండ్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో తోపుడు బండ్లు, దుకాణాలు ఏర్పాటు చేసుకొని పలువురు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. కాగా రాత్రి పూట కొందరు దుండగులు బండ్లకు నిప్పు పెట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు.