గుంతకల్లు పట్టణములోని వినాయక ఘాట్ వద్ద గల హైవే రోడ్డులో గుంత ఏర్పడడంతో వాహనాదారులు, పాదాచారులు ఇబ్బందులు పడుతున్నారని శుక్రవారం వార్డులో పర్యటనకు వచ్చిన మున్సిపల్ కమిషనర్ కు స్థానికులు విన్నవించారు. తక్షణమే స్పందించిన మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ రోడ్డుపై పడిన గుంతను పూడ్చే పనులను ప్రారంభించారు.