కోట్లు విలువ చేసే స్థలాన్ని ఆక్రమించారు
గుత్తి ఆర్ఎస్ లోని ముత్యాలమ్మ గుడి ఆవరణలో బుధవారం రిటైర్డ్ రైల్వే లోకో పైలట్ గంగాధర్ తన కుటుంబ సభ్యులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేనంబర్ 210లో సుమారు రెండు ఎకరాలకు పైగా ముగ్గురు వ్యక్తులు కబ్జా చేశారన్నారు. కబ్జా చేసిన స్థలం విలువ కోట్లల్లో ఉంటుందన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్, ఎస్పీ దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. అయినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.