మహారాష్ట్ర ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడం పట్ల శనివారం కళ్యాణదుర్గం పట్టణంలో బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా టీ సర్కిల్ లో బాణసంచా కాల్చి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ దేవరాజ్ మాట్లాడుతూ బీజేపీతో అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి, చక్కా సుబ్రహ్మణ్యం, రామకృష్ణ పాల్గొన్నారు.