కళ్యాణదుర్గం: బాలుడు అదృశ్యం - పోలీసులకు ఫిర్యాదు

80చూసినవారు
కళ్యాణదుర్గం: బాలుడు అదృశ్యం - పోలీసులకు ఫిర్యాదు
కంబదూరు మండలం నూతిమడుగు గ్రామంలోని వసతి గృహంలో ఉంటూ ఆరో తరగతి చదువుతున్న శివరాజ్ అనే విద్యార్థి కనిపించడం లేదని కంబదూరు పోలీసులకు తల్లిదండ్రులు మంగళవారం ఫిర్యాదు చేశారు. తిమ్మాపురానికి చెందిన అన్వేష్, భాగ్యమ్మ దంపతుల కుమారుడు శివరాజ్ నూతిమడుగులో చదువుకుంటున్నాడు. అయితే ఇంటికి వెళ్తానని బయలుదేరి ఇంటికి వెళ్లలేదు. దీంతో ఆచూకీ కోసం గాలించారు. ఆచూకీ లభించలేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్