Sep 19, 2024, 01:09 IST/
జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం
Sep 19, 2024, 01:09 IST
జమిలి ఎన్నికల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జమిలి ఎన్నికలకు సంబంధించిన ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను కేబినెట్ అమోదించింది. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.