రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, కార్మిక హక్కుల కాలరాసే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు డీ. చిన్నప్ప యాదవ్ సోమవారం డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ ఆపాలని, ఈనెల 26న కలెక్టరేట్ దగ్గర ఏపీ రైతు సంఘం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే మహా ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సింగనమల మండల కేంద్రంలో కరపత్రాలు పంపిణీ చేశారు