సిపిఎం పార్టీ దిగ్గజం సీతారాం ఏచూరి
ఉరవకొండ స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంతాప సభను జరిగింది. ఈ సందర్బంగా పలువురు ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ ఏచూరి ఎస్ఎఫ్ఐ ఉద్యమం నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శిగా అంచలంచలుగా ఎదిగి కార్మికుల కోసం కర్షకుల కోసం ప్రజల బాగోగుల కోసం అహర్నిశలు పాటుపడిన వ్యక్తిగా కొనియాడారు.