అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామంలో వైయస్సార్ ప్రమాద భీమా పంపిణీ చేశారు. కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. కడవలకుంట సుంకన్న భార్య వెంకటలక్ష్మి కు రాష్ట్ర ప్రభుత్వం తరపున వైయస్సార్ భీమా కింద 10 వేల రూపాయల నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో పెన్నహోబిలం ఆలయ ఛైర్మన్ రాకెట్ల అశోక్ కుమార్, నాగరాజు, గ్రామ పంచాయతీ సెక్రటరీ నాగభూషణ, పావని రామాంజీనమ్మ తదితరులు పాల్గొన్నారు.