శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందే: రక్షణశాఖ మంత్రి
భారత భద్రతా వ్యవస్థపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భద్రత విషయంలో మనం అంత అదృష్టవంతులం కాదని అన్నారు. బాహ్యంగా, అంతర్గతంగా శత్రువుల కదలికలపై దృష్టి పెట్టాలని సైన్యానికి సూచించారు. మధ్యప్రదేశ్లోని ఇందౌర్ జిల్లాలోని మావ్ కంటోన్మెంట్ వద్ద ఆర్మీ సిబ్బందిని ఉద్దేశించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.