'గేమ్ ఛేంజర్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయమై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో చర్చించనున్నానని నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఆ ఈవెంట్‌తో చరిత్ర సృష్టించాలని ఫ్యాన్స్‌ని కోరారు. రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో విజయవాడ బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో ఏర్పాటైన 256 అడుగుల రామ్ చరణ్ కటౌట్‌ను లాంచ్ చేసి అనంతరం మాట్లాడారు. పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు ఇక్కడకు వచ్చానని.. ఆయన చెప్పే డేట్‌ని బట్టి ఈవెంట్ ఎక్కడ చేయాలో నిర్ణయిస్తామన్నారు.