మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్‌కు నిర్మాత దిల్ రాజు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మూవీ ట్రైలర్‌ను న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. ఇక, దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్‌తో పాటు పాటలను విడుదల చేయగా.. సూపర్ రెస్పాన్స్‌తో దూసుకుపోతున్నాయి.