సంక్రాంతికి TGSRTC స్పెషల్ బస్సులు
సంక్రాంతి పండుగకు సొంతూరుకు వెళ్లేవారికి TGSRTC అదిరిపోయే శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలు సంక్రాంతికి ఇంటికెళ్లేందుకు సిద్ధమవుతుండడంతో రిజర్వేషన్లకు భారీగా రద్దీ పెరిగింది. దీంతో హైదరాబాద్ నుంచి సంక్రాంతి పండుగకు 3 వేల ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ సంస్థ వెల్లడించింది. కాగా, జనవరి తొలి వారం నుంచి 17వ తేదీ వరకు పది రోజులపాటు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి.