టెలికాం కంపెనీలు మొబైల్ రీఛార్జ్ ధరలు పెంచే అవకాశం ఉందని ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ మోతిలాల్ ఓస్వాల్ వెల్లడించింది. వచ్చే ఏడాది డిసెంబర్‌లో 15 శాతం టారిఫ్ పెంచవచ్చని తెలిపింది. యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ఏఆర్‌పీయూ) లెవల్స్ పెంచుకునేందుకు టెలికాం కంపెనీలు ఇకపై తరచూ ఈ పద్ధతిని కొనసాగించొచ్చని పేర్కొంది. కాగా, గత ఐదేళ్లలో మూడు సార్లు టారిఫ్ పెంచారు.