AP: నగల కోసం కన్నతల్లిని కొడుకు, కోడలు హతమార్చారు. ఈ ఘటన విజయవాడ జిల్లా గుణదల పోలీస్ స్టేషన్ పరిధిలోని మధురానగర్‌లో చోటు చేసుకుంది. ఆస్తి తగాదాల నేపథ్యంలో భార్యతో కలిసి తల్లి లక్ష్మి (62)ని కొడుకు పెద్ద సాంబశివరావు దిండుతో ఊపిరాడకుండా చేసి చంపారు. గుణదల పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్య కుమారుడే చేశాడని అనుమానం రావడంతో పోలీసులు విచారణ జరిపారు. దాంతో అసలు విషయం బయటకొచ్చింది.